Satavahana Currency - Coins - Pictures -శాతవాహనుల కాలంలోని నాణెములు. శాతవాహనుల కాలము నాటి నాణెములు నాగార్జునకొండ (గుంటూరు జిల్లా), శాలిహుండం (శ్రీకాకుళం), అత్తిరాల (కడప), వినుకొండ (గుంటూరు జిల్లా), ప్రాంతాలలో లభ్యమయ్యాయి. కొండాపూర్ (మెదక్ జిల్లా)లో శాతవాహ నుల కాలం నాటి టంకశాల బయటపడింది. ఈ టంకశాలలో బయటపడిన నాణెములలో 'సిరిచిముకశాత! అని రాయబడి ఉన్నది.

శాతవాహనుల నాణెములపై ఎద్దు, ఏనుగు, గుర్రం, స్వస్తిక్ గుర్తు, ఉజ్జయినీ తోరణం, త్రిరత్న, సింహ, ఓడ గుర్తులలో ముద్రించబడ్డాయి.

శాతవాహనుల కాలంలోని నాణెములు 

వాసిష్టీ పుత్ర శ్రీ పూలమావి కాలంలో ఓడ  గుర్తుతో నాణెం 

గౌతమి పుత్ర శ్రీ శాతకర్ణి కాలంలో నాణెం 

వాసిష్టీ పుత్ర శ్రీ శాతకర్ణి కాలంలో నాణెం 

గౌతమి పుత్ర శ్రీ యజ్ఞ శాతకర్ణి కాలంలో నాణెం

శ్రీ వసిష్ఠ పుత్ర పూలమావి కాలంలో నాణెం