1వ శాతకర్ణి అప్పటి వరకు మౌర్యుల యొక్క సామంతులుగా ఉన్న శాతవాహనులు మొదటి శాతకర్ణి కాలం నుంచి తమకు తాము స్వతంత్రులుగా ప్రకటించుకున్నారు. శాతవాహన రాజుల పరంగా గొప్ప రాజులలో ఒకడు. తన పేరుకు శాతవాహన అనే వంశం పేరును జోడించాడు.

1st Satakarni -Satavahana King - 1వ శాతకర్ణి శాతవాహనుల రాజు

మొదటిసారిగా తన యొక్క పేరుకు 'శాతవాహన' అనే వంశం పేరును జోడించే సాంప్రదాయమును మొదటి శాతకర్ణి ప్రారంభించారు.
ఈ మొదటి శాతకర్ణి పశ్చిమ వైపు నుంచి రాజ్య విస్తరణ చేస్తూ, అకర, అవంతి, ములక, మాళ్వా ప్రాంతాలను జయించారు. ఇతని భార్య నాగానిక ప్రాకృతంలో నానాఘాట్ (మహారాష్ట్ర) శాసనాన్ని వేయించింది.
ఈ శాసనంలో 1వ శాతకర్ణి గొప్పతనం, అప్పటి సమాజం గురించి వివరించింది.
నానాఘాట్ శాసనంలో 1వ శాతకర్ణి క్రింది బిరుదులతో పేర్కొనబడ్డాడు.
1. అప్రతిహతచక్ర
2. ఏకవీర
3. శూర
4. దక్షిణాపథపతి
5. అస్మకాదీశ/

పురాణాలు ఇతన్ని ఈ క్రింది విధంగా పేర్కొన్నాయి
1. మహాన్
2. మల్లకర్ణ -

కొన్ని ముఖ్య విషయాలు:
  • 1వ శాతకర్ణి విదర్భ, ఉజ్జయినిలను ఆక్రమించాడు
  • ఇతను పుష్యమిత్ర శుంగుడిని ఓడించి, దానికి గుర్తుగా ఉజ్జయిని పట్టణ గుర్తుతో నాణెములు ముద్రించాడు.
  • మొదటి శాతకర్ణి 'గజగుర్తు' గల నాణెములను ముద్రించారు.
  • మొదటి శాతకర్ణి మొదటగా వెండి నాణెములు ముద్రించాడు.
ఇతని సమకాలీన పాలకులు :
  • పుష్యమిత్ర శుంగుడు - మగధ
  • ఖారవేలుడు - కళింగ
  • డెమిట్రియస్ - ఇండో గ్రీకు (వాయువ్య భారత్)
  • ఇతను కళింగ ఖారవేలుడి పై దండెత్తి తన సామ్రాజ్యాన్ని తూర్పు భారతదేశం వైపు విస్తరించినట్లుగా చళ్ళ కళింగ జాతక ద్వారా తెలుస్తుంది.
  • మొదటి శాతకర్ణి డెమిట్రియను కూడా ఓడించాడు.
వైదిక మతం ప్రకారం యజ్ఞయాగాదులను నిర్వహించిన మొదటి రాజు. మొదట శాతథర్ణి ఈ యాగాల సందర్భంగా 36000 కర్షాపణాలు, 44000 గోవులు, 10 ఏనుగులు, 1000 గుర్రాలు, పన్ను మినహాయింపు భూములను బ్రాహ్మణులకు దానం ఇచ్చాడు.

1వ శాతకర్ణి మొదటిగా వైదిక సాంప్రదాయాలను పాటించి ఒక రాజసూయ యాగం, రెండు అశ్వమేధ యాగాలను నిర్వహించాడు. తను తొలిసారిగా బ్రాహ్మణులకు పన్ను మిహాయింపు భూములను దానంగా ఇచ్చాడు.
అతను బ్రాహ్మణులకు తొలిసారిగా వెండి నాణెములను దానం చేశాడు.
ఇతను వైవాహిక సంబంధాల ద్వారా సామ్రాజ్య విస్తరణకు కృషి చేసిన మొదటి శాతవాహన రాజు.