కణ్పుడు/కృష్ణుడు . శ్రీముఖుడి కుమారుడు 1వ శాతకర్ణి మైనర్ కావడం వల్ల ఇతని సోదరుడు కణ్పుడు లేదా కృష్ణుడు పాలకుడు అయ్యాడు..  శ్రీముఖుడి తరువాత అతని తమ్ముడు మొదటి కృష్ణుడు పరిపాలన చేశాడు., ఇతను 2వ శాతవాహన రాజు గా చెప్పుకోవచ్చు.

1st Kanhudu/ Krishnudu Satavahana Emporer - మొదటి కృష్ణుడు/ కణ్పుడు శాతవాహన రాజు

  • శ్రీముఖుడి తరువాత అతని తమ్ముడు మొదటి కృష్ణుడు పరిపాలన చేశాడు., ఇతను 2వ శాతవాహన రాజు గా చెప్పుకోవచ్చు.
  • ఇతడు కనేరి, నాసిక్ గుహలను తొలిపించాడు. నాసిక్ లో బౌద్ధ సన్యాసుల సంక్షేమం కొరకు ధర్మమహామాత్య అనే అధికారులను నియమించాడు. ఇతని కాలంలో భాగవత మతం దక్షిణ భారతదేశంలోకి ప్రవేశించింది.
  • భారతదేశంలో భాగవతమతంగా ఉన్నట్లు హెలియోడోరస్ బేస్ నగర్ శాసనం తెలియజేస్తున్నది. భాగవత మతం మగధ పాలకుడైన పుష్యమిత్ర శుంగుడి కాలంలో ఆవిర్భవించింది.
  • భాగవత మత స్థాపకుడిగా శ్రీకృష్ణుడిని పరిగణిస్తారుశ్రీముఖుడి మరొక తమ్ముడు హుకు.. హుకుశ్రీని నానాఘాట్ శాసనంలో రాజకుమారుడిగా పేర్కొనబడ్డాడు.
  • కర్నూలు జిల్లాలోని పిఠాపురంలో దొరికిన ఒక సీసపు బిళ్ళ మీద హుకుశ్రీ పేరు ఒక వైపు, రోమన్ చక్రవర్తి టైబీరియస్ బొమ్మ మరోవైపు ఉన్నాయి.
  • ఇటీవల కోటిలింగాల దగ్గరి మొక్క ట్రాపుపేట గ్రామం వద్ద దొరికిన ఒక శాసనంలో హుకుశ్రీ మొదటి శాతకరి, నాగానికల కుమారుడుగా పేర్కొనబడ్డాడు.