SriMukhudu - Satavahana Dynasty Founder - శ్రీముఖుడు శాతవాహన రాజ్యస్థాపకుడు .శ్రీముఖుడు / సిముఖుడు / చిముకుడు. ఇతను శాతవాహన రాజ్యస్థాపకుడు. ఇతని తండ్రి పేరు - శాతవాహనుడు. శాతవాహనుడి యొక్క నాణెములు మెదక్ లోని కొండాపూర్‌లో లభ్యమయ్యాయి. శాతవాహనుడు మౌర్య సామంతుడిగా ఉండేవాడని పేర్కొంటారు.

అశోకుని 13వ శిలాశాసనం ప్రకారం శ్రీముఖుడు కూడా  అతని సామంతుడు. అశోకుడు శ్రీముఖునికి 'రాయ' అనే బిరుదు ఇచ్చారని ప్రముఖ చరిత్రకారుడు డి.సి.సర్కార్ పేర్కొన్నారు. శ్రీముఖిడి బిరుదు 'గాయ' పేరు మీద గోదావరి ఒడ్డున కోటిలింగాలకు ఐదు కిలోమీటర్ల దూరంలోనే రాయపట్నం అనే గ్రామము ఏర్పడినది.

SriMukhudu - Satavahana Dynasty Founder - శ్రీముఖుడు శాతవాహన రాజ్యస్థాపకుడు

కొందరు చరిత్ర కారుల ప్రకారం శ్రీముఖుడు (సీముకుడు) స్వతంత్ర శాతవాహన రాజ్యాన్ని స్థాపించాడు. క్రీ.పూ.271 నుంచి 248 (23 ఏళ్లు) వరకు పాలించాడు. శ్రీముఖుడు సౌరాష్ర్ట పాలకుడైన మహారథి త్రనకైరోను ఓడించి అతడి కుమార్తె నాగానికను, తన కుమారుడైన మొదటి శాతకర్ణికిచ్చి వివాహం చేశాడు
శ్రీముఖుడి నాణేలు కరీంనగర్ జిల్లా కోటిలింగాల ప్రాంతంలో లభ్యమయ్యాయి. సంగారెడ్డి, కొండాపూర్ (మెదక్ జిల్లా) కర్ణాటకలోని సన్నతి, మహారాష్ర్టలోని నెవాస, జున్నార్, అకోల ప్రాంతాల్లో శ్రీముఖుని నాణేలు దొరికాయి

  • శ్రీముఖుడు నాణెములలో ఇతని పేరు చిముక అని పేర్కొనబడింది
  • శ్రీముఖుడు ప్రతిష్టానపురము రాజధానిగా చేసుకుని పరిపాలన చేశాడు. మొదటిగా కోటిలింగాల నుంచి పాలించాడు)
  • శ్రీముఖుని నాణెముల పై 'రణగోభద్ర', 'రణ గోస్వామి' అనే పేర్లు రాసి ఉన్నాయి.
  • నాగానిక తన నానాఘాట్ శాసనంలో 'సిరిచిముకశాత' అనే పదములను తెలియజేసినది.
  • శ్రీముఖుడు అనేక యుద్ధాలు చేశాడు.
  • ఇతను రాఠీకులు అనే నాగ తెగ వారిని ఓడించి వారితో వివాహ సంబంధాలు ఏర్పరుచుకున్నాడు. రాఠీకుల రాజు అయిన మహారధ త్రైన కైరో కుమార్తె నాగానికను తన కుమారుడు 1వ శాతకర్ణికి ఇచ్చి వివాహం చేశాడు. శ్రీముఖుడు మొదట్లో జైన మతాభిమాని. ఇతని జైన మత గురువు కాలకచూరి. తర్వాత కాలంలో ఇతను వైదిక మతాన్ని స్వీకరించాడు.
  • శ్రీముఖుడి కుమారుడు 1వ శాతకర్ణి మైనర్ కావడం వల్ల ఇతని సోదరుడు కణ్పుడు లేదా కృష్ణుడు పాలకుడు అయ్యాడు.